ప్రజాతీర్పును శిరసావహిస్తాం
విధాత: హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజాతీర్పును శిరసావహిస్తాం. ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున క్రతజ్ఙతలు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు దన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదని హరీష్ రావు పేర్కొన్నారు. అయితే, దేశంలో ఎక్కడలేనివిధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కల్సిపనిచేశాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. […]

విధాత: హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజాతీర్పును శిరసావహిస్తాం. ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున క్రతజ్ఙతలు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు దన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదని హరీష్ రావు పేర్కొన్నారు.
అయితే, దేశంలో ఎక్కడలేనివిధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కల్సిపనిచేశాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోదు.. గెలిచిననాడు పొంగిపోలేదు. ఓడినా.. గెలిచిన టీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.