TELANGANA | నేడు, రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు .. హెచ్చరించిన వాతావరణ శాఖ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం నిన్న రాత్రి తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారింది

TELANGANA | నేడు, రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు .. హెచ్చరించిన వాతావరణ శాఖ

సాగునీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేసిన ఇ.ఎన్.సి అనిల్ కుమార్

విధాత: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం నిన్న రాత్రి తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారింది. శుక్రవారం ఉదయం నాటి ఒడిశా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద వాయువ్య మరియు పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారిందని తెలిపింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ,అత్యంత భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

రానున్న 48 గంటలలో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయాన్న హైదరాబాద్ వాతావరణ శాఖా(రెడ్-టెక్-యాక్షన్) చేసిన సూచనలతో తెలంగాణా రాష్ట్ర నీటి పారుదల శాఖా అప్రమత్తమైంది.ఈ మేరకు శుక్రవారం ఉదయం ఇఎన్సీ జి.అనిల్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖాధికారులతో క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ఫోన్ లలో సమీక్షించారు. ముందస్తు జాగ్రత్తలపై తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు.ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటూనే భద్రతా చర్యల పట్ల ప్రజలను అప్రమత్తం చెయ్యాలన్నారు. రిజర్వాయర్లు,కాలువలు,నీటి మట్టాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూనే స్పిల్ వే లు,వరద గేట్లు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో తెలుసుకోవాలన్నారు.అత్యయిక పరిస్థితులు ఏర్పడితే ఎటువంటి నష్టం వాటిళ్ల కుండా అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అలాగే నీటి మట్టాలు, ప్రవాహం ఉధృతి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం తెలుసుకోవాలన్నారు. అత్యాయక పరిస్థితుల సమాచారం అప్పటికప్పుడే కంట్రోల్ రూమ్ కు అందించాలని అధికారులను ఆదేశించారు.