Sai Dharam Tej | సీఎం రేవంత్‌రెడ్డితో హీరో సాయి ధరమ్‌తేజ్ భేటీ
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం జూబ్లిహీల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో సాయి ధరమ్ తేజ్ భేటీ అయ్యారు

విధాత, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం జూబ్లిహీల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో సాయి ధరమ్ తేజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు కూడా వారితో ఉన్నారు.
ఇటీవలే తండ్రీకూతుళ్ల బంధంపై యూ ట్యూబర్ ప్రణిత్ చేసిన కామెంట్లపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయడం..దానిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించడం..నిందితులపై కేసు నమోదు..అరెస్టు, రిమాండ్ వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రయత్నాలకు తనవంతు చేయూతనందిస్తానని సాయి ధరమ్ తేజ్ పేర్కోనడం విశేషం.