Beer Shortage In Hyderabad | బీర్ల ఎద్దడితో నగరవాసులు విలవిల..ఎక్కడికిపోయినా నో స్టాక్ బోర్డ్స్!

హైదరాబాద్​ నగరంలో బీర్లు దొరకడంలేదు. అసలే ఉక్కపోతకు గురవుతున్న నగరవాసులపై ఇదో పిడుగుపాటుగా మారింది.

Beer Shortage In Hyderabad  | బీర్ల ఎద్దడితో నగరవాసులు విలవిల..ఎక్కడికిపోయినా నో స్టాక్ బోర్డ్స్!

హైదరాబాద్​ నగరంలో బీర్లకు కొరత ఏర్పడింది. ఇది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నీటి కొరత బీర్ల తయారీని కూడా దెబ్బ కొట్టింది. దాంతో బ్రూవరీలు బీర్​ తయారీని కూడా తగ్గించేసారు. మామూలుగా తెలంగాణలో సగటున నెలకు 30 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతుంటాయి. అందునా వేసవిలోనే ఎక్కువ శాతం తాగేస్తుంటారు. ముఖ్యంగా ఐటీ రంగంలో అగ్రభాగాన ఉన్న హైదరాబాద్​లో సహజంగానే బీర్ల అమ్మకాలు ఎక్కువగా నమోదవుతుంటాయి.

ప్రతీరోజూ వందకు పైగా బీర్ల కేసులు ఒక్కో షాపుకు డెలివరీ అవుతుంటాయి. అలాంటిది ప్రస్తుతం 12 కేసులే ఇస్తున్నట్లు వైన్​షాపు యజమానులు వాపోతున్నారు. డిమాండ్​ తట్టుకోలేక, బీర్లు లేవు అనే బోర్డులు కూడా తగిలిస్తున్నట్లు వారు తెలిపారు. ఇక మరికొంతమంది పక్క రాష్ట్రాల నుండి దొంగతనంగా విచిత్రమైన బ్రాండ్ల బీర్లను తెప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో బీరుప్రియులు అదెంత భయంకరంగా ఉన్నా, తాగక తప్పడం లేదంటున్నారు. మొత్తానికి  ఈ ఎండాకాలంలో హైదరాబాద్​ బీరు ప్రియుల బాధలు వర్ణనాతీతం.