ఆరేళ్ళ బాలిక అల్ఫియా కిడ్నాప్..షాద్ నగర్ లో క్లైమాక్స్

విధాత‌: కిడ్నాప్ కు గురైన బాలికను 23 గంటల్లోనే తిరిగి తల్లివద్దకు చేర్చారు హైదరాబాద్ పోలీసులు. మంగళవారం పురానిహవేలిలోని డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డిసిపి గజరావు భూపాల్ వివరాలను వెల్లడించారు. అంబర్​పేట్​ ఆలీకేఫ్​ ప్రాంతానికి చెందిన ముస్కాన్​ ఆలీ మీర్జా(41) తన కూతురు అల్ఫియా(6)తో కలిసి భిక్షాటన చేస్తుంది. కాగా ఈ నెల 13వ తేదీన ఉదయం 11గంటల సమయంలో చంచల్​గూడలో బిక్షాటన చేస్తుండగా ఓ మహిళ వాళ్ల దగ్గరికి వచ్చి తన పేరు […]

ఆరేళ్ళ బాలిక అల్ఫియా కిడ్నాప్..షాద్ నగర్ లో క్లైమాక్స్

విధాత‌: కిడ్నాప్ కు గురైన బాలికను 23 గంటల్లోనే తిరిగి తల్లివద్దకు చేర్చారు హైదరాబాద్ పోలీసులు. మంగళవారం పురానిహవేలిలోని డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డిసిపి గజరావు భూపాల్ వివరాలను వెల్లడించారు. అంబర్​పేట్​ ఆలీకేఫ్​ ప్రాంతానికి చెందిన ముస్కాన్​ ఆలీ మీర్జా(41) తన కూతురు అల్ఫియా(6)తో కలిసి భిక్షాటన చేస్తుంది. కాగా ఈ నెల 13వ తేదీన ఉదయం 11గంటల సమయంలో చంచల్​గూడలో బిక్షాటన చేస్తుండగా ఓ మహిళ వాళ్ల దగ్గరికి వచ్చి తన పేరు ఫాతిమా అని హఫీజ్​బాబానగర్​లో ఓ స్వచ్చంద సేవా సంస్థ పెద్ద ఎత్తున బట్టలు, డబ్బుదానం (జకాత్​) ఇస్తుంటారని నమ్మబలికింది. వెంటనే వారిని ఆటోలో ఎక్కించుకుని హఫీజ్​బాబానగర్​కు చేరుకుంది. అక్కడే ఉన్న ఓ ఇంటిని మీర్జాకు చూపెట్టింది. ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్లి జకాత్​ తీసుకో అని మాయమాటలు చెప్పింది. ఆటో దిగి కాస్త ముందుకు మీర్జా వెళ్లగానే ఆరేళ్ల మైనర్​ బాలికతో ఆటోలో ఫాతిమా పరారయ్యింది. మీర్జా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచన్​బాగ్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని సంతోష్​నగర్​ డివిజన్​ ఏసీపీ శివరాం శర్మ పర్యవేక్షణలో ఐదు బృందాలను రంగంలోకి దింపారు. హఫీజ్​ బాబానగర్​ నుంచి రెండు ఆటోలను మార్చుతూ ఫాతిమా బాలికతో శంషాబాద్​కు చేరుకుంది. అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లోని సొంత ఇంటికి బాలికను కిడ్నాప్​ చేసి తీసుకువెళ్లినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. పోలీసులు వెంటనే ఫాతిమాగా చెప్పుకున్న ఆసియాబి(26) ను అదుపులోకి తీసుకుని కిడ్నాపర్​ చెర నుంచి బాలికకు విముక్తి కలిగించారు. షాద్ నగర్ లో పోలీస్ కానిస్టేబుల్ హన్మంతు చాకచక్యంగా నెరస్తురాలును గుర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. 5వందల పారితోషకం పోలీస్ శాఖ తరుపున అందజేశారు. శంషాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆసియాబి పై అక్రమంగా రేషన్​ బియ్యం తరలింపు కేసు కూడా ఉన్నట్లు డిసిపి పేర్కొన్నారు. ఈ సమావేశంలో దక్షిణమండలం అదనపు డిసిపి సయ్యద్​ రఫిక్, సంతోష్​నగర్​ ఏసీపీ శివరాం శర్మ, కంచన్​బాగ్​ ఇన్​స్పెక్టర్​ జి. వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు..