Kaleshwaram | కాళేశ్వరంపై త్వరలో మధ్యంతర నివేదిక
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళపై నివేదికను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

జల సౌధలో నీటి పారదల అధికారుల సమీక్ష
విధాత: కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళపై నివేదికను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అందులో ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు ఇ.యన్.సి.ఓ అండ్ యం.బి. నాగేందర్ రావు, ఇ.యన్.సి రామగుండం కే.సుధాకర్ రెడ్డిలతో పాటు ఇతర నీటిపారుదల శాఖాధికారులతో శుక్రవారం జలసౌధలో సి.యస్.యం.ఆర్.యస్ (సెంట్రల్ సాయిల్ మరియు మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్), సి.డబ్ల్యు.పి.ఆర్.యస్ (సెంట్రల్ వాటర్ మరియు పవర్ రీసెర్చ్ స్టేషన్) ఎన్.డి.యస్.ఏ (జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థలకు చెందిన ప్రతినిధులు అమితాబ్ మీనా,మనీష్ గుప్తా, డాక్టర్ మందిరలు సమావేశమై సమీక్షించారు. త్వరగా మధ్యంతర నివేదికను ఇవ్వడానికి నిపుణులతో పాటు ఎన్. డి.యస్.ఏ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చించాలని నిర్ణయించారు. ఇంకా ఈ సమావేశంలో సి.ఇ.సి.డి. ఓ మోహన్ కుమార్, సి.ఇ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.