పొంగులేటి ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

విధాత : మాజీ ఎంపీ కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో రెండవ రోజు కూడా ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యులను హైదరాబాద్ తీసుకొచ్చిన అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన హైదరాబాద్, ఖమ్మంలలోని నివాసాల్లో, బంధువుల ఇళ్లలో, వివిధ చోట్ల ఉన్న కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు తమ సంస్థ సిబ్బందిపై చేయి చేసుకున్నారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.