ప్రభుత్వ సలహాదారుగా కేకే.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ నేత, మాజీ రాజ్యసభసభ్యులు కె. కేశవరావు( కేకే)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. బీఆరెస్ ఎంపీగా పార్లమెంటరీ నేతగా ఉన్న కేకే ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

విధాత: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ నేత, మాజీ రాజ్యసభసభ్యులు కె. కేశవరావు( కేకే)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. బీఆరెస్ ఎంపీగా పార్లమెంటరీ నేతగా ఉన్న కేకే ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉన్న సీనియర్ నేత సలహాలు తీసుకోవాలని భావించిన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు రేవంత్ రెడ్డి కేశవరావును పబ్లిక్ ఎఫైర్స్ సలహాదారుగా కేబినెట్ హోదాతో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది