ప్రజల కోసం జీవించిన మహోన్నత వ్యక్తి కాళోజీ: కలెక్టర్ పమేలా

విధాత, యాదాద్రి భువనగిరి: ప్రజాకవి కాళోజీ మహోన్నత వ్యక్తి అని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ మహోన్నత వ్యక్తి అని, తెలంగాణ భాష, ప్రజల అవసరాల కోసం పాటుపడిన వ్యక్తి అని అన్నారు. తమ కవితలు, రచనల […]

ప్రజల కోసం జీవించిన మహోన్నత వ్యక్తి కాళోజీ: కలెక్టర్ పమేలా

విధాత, యాదాద్రి భువనగిరి: ప్రజాకవి కాళోజీ మహోన్నత వ్యక్తి అని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ మహోన్నత వ్యక్తి అని, తెలంగాణ భాష, ప్రజల అవసరాల కోసం పాటుపడిన వ్యక్తి అని అన్నారు. తమ కవితలు, రచనల ద్వారా పోరాట స్ఫూర్తి నింపారని అన్నారు. అధికారులు తరచూ జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, గురుకులాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమవుతుండాలని, విద్యా వికాసపరమైన ఆలోచనలను ప్రభావితం చేయాలని, తద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేసినవారమవుతామని సూచించారు.

జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు తాడిత పీడిత ప్రజలకు అనుకూలంగా, ఎక్కడ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా గొంతెత్తిన వ్యక్తి అన్నారు. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిదని ఉద్బోధించి తన బతుకును తెలంగాణ కోసం ధార పోసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

తెలంగాణ యాసలో మాట్లాడడానికి ఎందుకు భయం, దాని బదులు చావడం మేలు అని కవితావేశం వెలుబుచ్చిన వ్యక్తి అని, తెలుగువాడివై ఉండి తెలుగులో మాట్లాడక ఇతర భాషలపై మోజు ఎందుకని తెలంగాణ యాస భాష కోసం చనిపోయేంత వరకు పరి తపించారన్నారు.

తెలంగాణ యాస, భాషను తన రచనలలో ఎలుగెత్తి చాటిన వ్యక్తి అని అన్నారు. వారికి గుర్తుగా వారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి వారిని గౌరవించిందని తెలిపారు. అంతే కాకుండా వరంగల్ లో కాళోజీ కళాక్షేత్రం, అలాగే హెల్త్ యూనివర్సిటీకి వారికి పేరు పెట్టడం జరిగిందని తెలిపారు.

మనమంతా వారి బాటలో నడవాల్సి ఉందని అన్నారు. విద్య కోసం ప్రభుత్వం అందిస్తున్న వసతులను, పథకాలను, విద్యా ఓవర్సీస్ స్కాలర్షిప్పులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరే విధంగా మనం కృషి చేద్దామని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య, జిల్లా పంచాయితీ అధికారి సునంద, జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్, జిల్లా మైనారిటీ అధికారి సత్యనారాయణ, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి జయపాల్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ యశోద, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.