ప్రజా హితమే కంది శ్రీ‌నివాస‌రెడ్డి ల‌క్ష్యం: కంది సాయిమౌనారెడ్డి

ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రజా హితంతో తన భర్త కంది శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో అడుగుపెట్టార‌ని ఆయ‌న స‌తీమ‌ణి కంది సాయి మౌనారెడ్డి అన్నారు.

ప్రజా హితమే కంది శ్రీ‌నివాస‌రెడ్డి ల‌క్ష్యం: కంది సాయిమౌనారెడ్డి
  • కాంగ్రెస్ ను గెలిపిస్తే మరింత అభివృద్ధి
  • ఆదిలాబాద్‌లో కంది స‌తీమ‌ణి సాయిమౌనారెడ్డి ప్రచారం


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రజా హితంతో తన భర్త కంది శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో అడుగుపెట్టార‌ని ఆయ‌న స‌తీమ‌ణి కంది సాయి మౌనారెడ్డి అన్నారు. గురువారం ప‌ట్ట‌ణంలోని రాణిసతీజీ, విద్యానగర్ కాల‌నీల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌తో క‌లిసి త‌న భ‌ర్త‌, ఆదిలాబాద్ అభ్య‌ర్థి కంది శ్రీ‌నివాస‌రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేప‌ట్టారు. ఇంటింటికీ తిరుగుతూ చెయ్యి గుర్తుకే ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు.


కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీల‌ క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేస్తూ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న కల్పించారు. ఆదిలాబాద్‌లో మార్పు రావాలంటే త‌న భ‌ర్త‌ కందికి ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. చిన్నాపెద్దా తేడాలేకుండా అంద‌రినీ ఆత్మీయంగా చిరున‌వ్వుతో ప‌ల‌క‌రిస్తూ సాయి మౌనారెడ్డి ప్రచారంలో ముందుకుసాగారు. ఈకార్యక్రమంలో నాయకులు ముడుపు నళినీ రెడ్డి, లత, స్వప్న, ప్రమీల, సుస్మిత, శరణ్య, అఖిల్ రెడ్డి, ప్రభాకర్, సన్నీ, రామన్న పాల్గొన్నారు.