Medak: మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట: ఇఫ్తార్ విందులో మంత్రి హరీష్‌రావు
విధాత, మెదక్ బ్యూరో: మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మెదక్ షాదీ ఖానాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో మైనరిటీల సంక్షేమానికి 250 కోట్ల రూపాయల కేటాయించడం జరిగిందని తెలిపారు. మెదక్ పట్టణంలో ముస్లిం మైనార్టీలకు 250 ఇల్లు కేటాయించామని, మిగిలిపోయిన అర్హులైన వారికి […]

విధాత, మెదక్ బ్యూరో: మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మెదక్ షాదీ ఖానాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సంవత్సరం బడ్జెట్లో మైనరిటీల సంక్షేమానికి 250 కోట్ల రూపాయల కేటాయించడం జరిగిందని తెలిపారు. మెదక్ పట్టణంలో ముస్లిం మైనార్టీలకు 250 ఇల్లు కేటాయించామని, మిగిలిపోయిన అర్హులైన వారికి కూడా ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కిచెన్ షెడ్ నిర్మాణానికి 20 లక్షల రూపాయలు అందిస్తారని తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజర్షిషా మాట్లాడారు. ఇఫ్తార్ విందులో Zp ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్, జిల్లా మైనార్టీ అధికారి జమ్లా నాయక్, ఇఫ్కా.డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ఇతర జిల్లా అధికారులు, అధిక సంఖ్యలో మైనార్టీలు, మౌలానా జావిద్ అలి, సమియొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.