ఇకనుంచి హనుమకొండ జిల్లా వరంగల్ పేరు మార్చిన కేసీఆర్

విధాత:సీఎం కేసీఆర్ సోమవారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నట్టు తెలిపారు. ఇకపై వరంగల్, హన్మకొండ రెండు జిల్లాలుగా కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ను త్వరలోనే నిర్మిస్తామని వెల్లడించారు. ఆదివారం రోజునే వరంగల్ జిల్లాకు వెటర్నరీ కాలేజీని మంజూరు చేసినట్టు కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా జిల్లాకు డెంటల్ కాలేజీని మంజూరు చేస్తున్నట్టు హామీ […]

ఇకనుంచి హనుమకొండ జిల్లా వరంగల్ పేరు మార్చిన కేసీఆర్

విధాత:సీఎం కేసీఆర్ సోమవారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నట్టు తెలిపారు. ఇకపై వరంగల్, హన్మకొండ రెండు జిల్లాలుగా కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ను త్వరలోనే నిర్మిస్తామని వెల్లడించారు. ఆదివారం రోజునే వరంగల్ జిల్లాకు వెటర్నరీ కాలేజీని మంజూరు చేసినట్టు కేసీఆర్ తెలిపారు.

అంతేకాకుండా జిల్లాకు డెంటల్ కాలేజీని మంజూరు చేస్తున్నట్టు హామీ ఇచ్చారు. వరంగల్ పరిశ్రమలకు కేంద్రం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. కొత్తగా జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేసిన కారణంగా.. వరంగల్ విద్యా, వైద్యానికి కేంద్రంగా ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ప్రపంచలోనే వైద్య సేవలు కెనడాలో బాగున్నాయని అంటారు.. అక్కడ వైద్యశాఖ అధికారులు, మంత్రి పర్యటించి వైద్యసేవలను పరిశీలించండని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో పరిపాలన సంస్కరణలు తీసుకువచ్చినట్టు తెలిపారు. ‘కలెక్టర్’ పేరు కూడా మార్చాలి.. అది బ్రిటిష్ కాలంలో పెట్టిన పేరు అని వెల్లడించారు.