ఖమ్మం–హైదరాబాద్​ ప్రయాణీకులకు శుభవార్త..!

హైదరాబాద్​ నుండి విజయవాడ జాతీయ రహదారి 65 కు అనుసంధానిస్తున్న ఖమ్మం–సూర్యాపేట కొత్త జాతీయ రహదారి 365బిబికి కేంద్రం ఒక ఫ్లైఓవర్​ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.

ఖమ్మం–హైదరాబాద్​ ప్రయాణీకులకు శుభవార్త..!

జాతీయ రహదారి 65(NH 65).. హైదరాబాద్​ విజయవాడ(Hyderabad to Vijayawada)లను కలిపే ప్రధాన రహదారి. నిత్యం ఎంతో బిజీగా ఉండే ఈ రోడ్డును 6 వరుసలు(6 Lane)గా చేసేందుకు కేంద్రం ఈమధ్యే అనుమతులు మంజూరు చేసింది. మధ్యలో ఉండే పెద్ద పట్టణం సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రం. ఇక్కన్నుంచి ఖమ్మం(Khammam) జిల్లా కేంద్రానికి వెళ్లే ఇంకో జాతీయ రహదారి 365బిబిNH 365BB), సూర్యాపేట జిల్లా టేకుమట్ల(Tekumatla) వద్ద ఎన్​హెచ్​ 65ను కలుస్తుంది. అయితే ఇక్కడో విచిత్రమైన సమస్య ఏర్పడింది. హైదరాబాద్​ నుండి ఖమ్మం వెళ్లే వాహనదారులు టేకుమట్ల వద్ద ఎన్​హెచ్​ 65 నుండి దిగి నేరుగా 365బిబి మీదుగా ఖమ్మం వెళ్లిపోవచ్చు. కానీ, ఖమ్మం నుండి హైదరాబాద్(Khammam to HYD)​కు వచ్చే ప్రయాణీకులకు మాత్రం ఎన్​హెచ్ 65 ఎక్కేందుకు దారిలేదు. వారలాగే ఓ మూడు కిలోమీట్లరు సూర్యాపేట వైపుగా వెళ్లి అక్కడ యూటర్న్(U-Turn)​ తీసుకుంటేనే హైదరాబాద్​ వైపు హైవే 65 ఎక్కగలరు.

ఈ ఇబ్బందిని అధిగమించాలంటే ఖమ్మం నుండి వచ్చే వాహనాలు హైవే 365బిబి నుండి నేరుగా హైవే 65 ఎక్కేందుకు టేకుమట్ల జంక్షన్​ వద్దే ఒక ఫ్లైఓవర్​ నిర్మిస్తే ఈ మూడు కిలోమీటర్ల యూటర్న్​ బాధ తప్పుతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి గానూ ఎన్నోసార్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖామంత్రి(Minister of Road Transport and Highways of India) నితిన్​ గడ్కరీ(Nitin Gadkari)ని వ్యక్తిగతంగా కలిసి వినతులిచ్చిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(Vaddiraju Ravidhandra) ఎట్టకేలకు దాన్ని సాధించగలిగారు. ఈ విషయంలో సూర్యాపేట ఎమ్మెల్యే, అప్పటి రాష్ట్రమంత్రి జగదీశ్​రెడ్డి(Guntakandla jagadeesh Reddy) కూడా చాలా ప్రయత్నాలు చేసారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ(NHAI) ద్వారా ఈ ఫ్లైఓవర్​ను నిర్మించనుంది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో ఖమ్మం వాసుల యూటర్న్​ కష్టాలు తీరిపోతాయి.

Tags: