ఢిల్లీకి హుటాహుటిన బయలుదేరిన కిషన్‌రెడ్డి, బండిలు

తెలంగాణ బీజేపీ ఎంపీలు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఆదివారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం కర్తవ్య పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో మంత్రివర్గంలోకి వారిద్ధని తీసుకోనున్నట్లుగా సమాచారం అందడంతో వారు ఢిల్లీ వెళ్లారు

ఢిల్లీకి హుటాహుటిన బయలుదేరిన కిషన్‌రెడ్డి, బండిలు

కేంద్ర మంత్రివర్గంలో చోటు

విధాత: తెలంగాణ బీజేపీ ఎంపీలు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఆదివారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం కర్తవ్య పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో మంత్రివర్గంలోకి వారిద్ధని తీసుకోనున్నట్లుగా సమాచారం అందడంతో వారు ఢిల్లీ వెళ్లారు. ఉదయం పీఎంవో నుంచి మంత్రులుగా వారిద్దరు ప్రమాణాలు చేయాల్సివుంటుందని వెంటనే ఢిల్లీ చేరుకోవాలని ఫోన్‌ కాల్‌ రావడంతో కిషన్‌రెడ్డి, సంజయ్‌లు ఢిల్లీకి వెళ్లారు.

ప్రధాని నివాసంలో నూతన మంత్రులుగా ఎంపికైన వారికి మోదీ ఏర్పాటు చేసిన తేనేటి విందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు హాజరయ్యారు. సాయంత్రం కర్తవ్యపథ్‌ వేదికగా జరిగే ప్రధాని, కేబినెట్‌ ప్రమాణ స్వీకారంలో భాగంగా వారిద్ధరు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.