సింగపూర్‌లో కోదాడ యువకుడి మృతి
కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్‌లోలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం 'స్నేహితులతో కలిసి పవన్ బీచ్ కు వెళ్లి అలల ఉధృతికి కొట్టుకుపోయిన మృతి చెందాడు

విధాత, హైదరాబాద్ : కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్‌లోలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం ‘స్నేహితులతో కలిసి పవన్ బీచ్ కు వెళ్లి అలల ఉధృతికి కొట్టుకుపోయిన మృతి చెందాడు. అలల ఉధృతి అంచనా వేయలేక గల్లంతైన పవన్ మృతదేహాన్ని సింగపూర్ పోలీసులు బయటకు తీసి మృతదేహాన్ని కోదాడకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కొన్నినెలలుగా సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సింగపూర్ నుంచి పవన్ మృతి సమాచారం కుటుంబ సభ్యులకు చేరడంతో కోదాడ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.