టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అవినీతిపరుడని, ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలంటూ బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ

ఆయన అవినీతిపరుడైతే మీరెందుకు డీజీపీగా పెట్టారు

విధాత : టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అవినీతిపరుడని, ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలంటూ బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. మహేందర్‌రెడ్డి అవినీతి పరుడైతే మీరెందుకు డీజీపీగా పెట్టారని కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ మహేందర్ రెడ్డి నియామకు జరిగి రెండు వారాలే అయిందని, 36 ఏళ్లుగా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారని, ఆయన ఏమైనా లిక్కర్ స్కాం చేశారా? పేపర్లు లీక్ చేశారా? అవినీతి మరకే ఉంటే మీ 'ప్రభుత్వంలో డీజీపీగా ఎందుకు కూర్చోబెట్టారని కొండా సురేఖ నిలదీశారు. కవిత వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు. మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాలేదని, రాష్ట్రాన్ని పదేళ్ళ పాలించిన వాళ్ళు ఇప్పుడు మాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సింగరేణి నిధులను సిరిసిల్ల, గజ్వేల్‌కు తరలించుకుపోయిందెవరని ప్రశ్నించారు.

బీఆరెస్‌ పాలనలో తెలంగాణ యువతకు న్యాయం చేయలేదని, వారి భవిష్యత్ను ప్రశ్నార్ధకం చేశారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, ఎంతసేపు దోపిడిపైనే వారు దృష్టి పెట్టారని విమర్శించారు. నిరుద్యోగుల నమ్మకాన్ని నమ్ముకం వమ్ము చేయకుండా తమ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తీసుకుంటుందన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగాలిస్తామన్న మాట నిలబెట్టుకుంటుందన్న అక్కసుతో కవిత విమర్శలు చేస్తున్నారన్నారు.

Subbu

Subbu

Next Story