మహిళలకు ఫ్రీ బస్సు గ్యారంటీ అమలవుతుందో లేదో తెలుసుకునేందుకు చీర కట్టుకుని ఆడపిల్లలా తయారై ఆర్టీసీ బస్సెక్కు అంటూ కేటీఆర్‌ను ఉద్ధేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా కౌంటర్ వేశారు
సీఎం రేవంత్‌రెడ్డి చీర వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్
విధాత : మహిళలకు ఫ్రీ బస్సు గ్యారంటీ అమలవుతుందో లేదో తెలుసుకునేందుకు చీర కట్టుకుని ఆడపిల్లలా తయారై ఆర్టీసీ బస్సెక్కు అంటూ కేటీఆర్‌ను ఉద్ధేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా కౌంటర్ వేశారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు ? నెలకు రూ.2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా? అంటూ ఘాటుగా ఎదురుదాడికి దిగారు. తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు తమకిచ్చిన హామీల అమలు ఏదని అడుగుతున్నారని, వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలేనన్నారు.
డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపమని విమర్శించారు. మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం చెందిందని, కేసిఆర్ కిట్ ఆగిందని, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిందని, కల్యాణ లక్ష్మి నిలిచిపోయిందని, తులం బంగారం అడ్రస్ లేదని, ఫ్రీ బస్సు అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని, చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదని అందరికి తెలిసిపోయిందని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.