నాన్న నన్ను ఐఏఎస్‌ చేయాలనుకున్నారు

విధాత‌: విభజనతో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తూనే తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఎంపీపీ విద్యార్థులతో కేటీఆర్‌ మాట్లాడారు. రైతు బంధు వచ్చాక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. దళిత బంధుతో ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. ఇప్పటివరకు 1.39 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కదురదని చెప్పారు. ‘నాన్న నన్ను […]

నాన్న నన్ను ఐఏఎస్‌ చేయాలనుకున్నారు

విధాత‌: విభజనతో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తూనే తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఎంపీపీ విద్యార్థులతో కేటీఆర్‌ మాట్లాడారు. రైతు బంధు వచ్చాక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. దళిత బంధుతో ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. ఇప్పటివరకు 1.39 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కదురదని చెప్పారు. ‘నాన్న నన్ను ఐఏఎస్‌ చేయాలనుకున్నారు. ఆయనకు తెలియకుండానే నేను రాజకీయాల్లోకి వచ్చా..’ అని కేటీఆర్‌ గుర్తు చేసుకున్నారు.