KTR vs Konda Surekha | కొండా సురేఖ గ‌తంలో ఉచ్చ ఆగ‌డం లేదా అని అన‌లేదా..? : కేటీఆర్

KTR vs Konda Surekha | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ), మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది.

KTR vs Konda Surekha | కొండా సురేఖ గ‌తంలో ఉచ్చ ఆగ‌డం లేదా అని అన‌లేదా..? : కేటీఆర్

KTR vs Konda Surekha | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ), మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. గ‌తంలో త‌మ‌పై ట్రోలింగ్ పేరుతో దాడి జ‌ర‌గ‌లేదా..? కొండా సురేఖ గ‌తంలో ఉచ్చ ఆగ‌డం లేదా అని అన‌లేదా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. తెలంగాణ భ‌వ‌న్‌( Telangana Bhavan )లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడ‌బొబ్బ‌లు దేనికి..? బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ఆమెపై ఎవ‌రు మాట్లాడ‌లేదు.. ఇదే సోషల్ మీడియా( Social Media )లో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా? కొండా సురేఖ గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా..? ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి. గతంలో ఇదే కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు పంపిస్తాన‌ని కేటీఆర్ తెలిపారు.

ఇదే కొండా సురేఖ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్( Phone Tapping ) చేశారని గ‌తంలో కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడలేదా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తా.. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ వేసి కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలి అని కేటీఆర్ సూచించారు.