తెరాస గూటికి ఎల్.రమణ..కాసేపట్లో కెసిఆర్ తో ఎల్. రమణ భేటీ
విధాత:ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆవిర్భవించిన నేపథ్యంలో టీడీపీ నెమ్మదిగా కనుమరుగవుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చెప్పుకోతగ్గ అసెంబ్లీ సీట్లు సాధించినప్పటికీ, ఆ తర్వాత కాలంలో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ వచ్చారు. అయితే ఎల్.రమణ మాత్రం పార్టీని అంటిపెట్టుకుని చంద్రబాబుకు ఎంతో నమ్మకంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీలో నిబద్ధత గల నేతగా ఎల్.రమణకు పేరు. ఇటీవల టీడీపీ నిర్వహించిన మహానాడులో కూడా ఎల్.రమణ పాల్గొని తెలంగాణకు సంబంధించి కొన్ని తీర్మానాలు కూడా చేశారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి […]

విధాత:ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆవిర్భవించిన నేపథ్యంలో టీడీపీ నెమ్మదిగా కనుమరుగవుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చెప్పుకోతగ్గ అసెంబ్లీ సీట్లు సాధించినప్పటికీ, ఆ తర్వాత కాలంలో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ వచ్చారు. అయితే ఎల్.రమణ మాత్రం పార్టీని అంటిపెట్టుకుని చంద్రబాబుకు ఎంతో నమ్మకంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీలో నిబద్ధత గల నేతగా ఎల్.రమణకు పేరు.
ఇటీవల టీడీపీ నిర్వహించిన మహానాడులో కూడా ఎల్.రమణ పాల్గొని తెలంగాణకు సంబంధించి కొన్ని తీర్మానాలు కూడా చేశారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి నిర్ణయించారు. మరోవైపు తెలంగాణలో రాజకీయంగా చోటు చేసుకున్న కీలక పరిణామాలు ఎల్.రమణ ఆలోచనలో మార్పు తీసుకొచ్చాయి. ఈటల రాజేందర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం, ఆ తర్వాత పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో రాజకీయం రసకందాయంలో పడినట్టైంది.కాగా కాసేపట్లో కెసిఆర్ తో ఎల్. రమణ భేటీకానున్నారు.