కాళేశ్వ‌రం లిఫ్టింగ్‌ ఎ రివర్‌..

ఈరోజు రాత్రి 8 గంట‌ల‌కు డిస్క‌వ‌రీ చానెల్‌లో ప్ర‌సారం విధాత‌:మానవాళి చరిత్రలోనే అత్యద్భుతం కాళేశ్వరం నీటి ప్రాజెక్టు. నీరు పల్లమెరుగు అనే ప్రకృతి తత్వానికి విరుద్ధంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, అత్యంత తక్కువ సమయంలో, ఏకంగా ఒక నదినే ఎగువకు పారించి, బీడు భూములు సస్యశ్యామలం చేయడం ఒక అపూర్వ ఘట్టం. కాలువలు, సొరంగాల ద్వారా గోదావరి జలాలు దశలు దశలుగా నడకలు సాగిస్తూ సముద్ర మట్టానికి సుమారు ఆరువందల కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోవడం ఒక […]

కాళేశ్వ‌రం లిఫ్టింగ్‌ ఎ రివర్‌..

ఈరోజు రాత్రి 8 గంట‌ల‌కు డిస్క‌వ‌రీ చానెల్‌లో ప్ర‌సారం

విధాత‌:మానవాళి చరిత్రలోనే అత్యద్భుతం కాళేశ్వరం నీటి ప్రాజెక్టు. నీరు పల్లమెరుగు అనే ప్రకృతి తత్వానికి విరుద్ధంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, అత్యంత తక్కువ సమయంలో, ఏకంగా ఒక నదినే ఎగువకు పారించి, బీడు భూములు సస్యశ్యామలం చేయడం ఒక అపూర్వ ఘట్టం. కాలువలు, సొరంగాల ద్వారా గోదావరి జలాలు దశలు దశలుగా నడకలు సాగిస్తూ సముద్ర మట్టానికి సుమారు ఆరువందల కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోవడం ఒక పెద్ద వింత. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన బాహుబలి పంపులు కూడా మానవుడి సాంకేతికతకు మచ్చుతునకలు. పాలకులు చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయాలని తలపెడితే సాధ్యం కానిదేదీ ఉండదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రికయైన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, అబ్బురం కలిగించింది. ఈ మానవ నిర్మిత అద్భుతంపై కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స రూపొంచిన ‘లిఫ్టింగ్‌ ఎ రివర్‌’ డాక్యుమెంటరీ ఈ నెల 25న డిస్కవరీ చానెల్‌లో రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది.