యువ మిత్రుడుని కలిశాను: ప్రధాని మోదీ ట్వీట్

నా యువ మిత్రుడిని కలిశా అంటూ మోదీ ట్వీట్ చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీ షెడ్యూల్ తో ప్రచారంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ చిన్నారితో సరదాగా గడిపారు

యువ మిత్రుడుని కలిశాను: ప్రధాని మోదీ ట్వీట్

విధాత, వరంగల్ ప్రతినిధి: నా యువ మిత్రుడిని కలిశా అంటూ మోదీ ట్వీట్ చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీ షెడ్యూల్ తో ప్రచారంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ చిన్నారితో సరదాగా గడిపారు. వరంగల్లో ప్రచార ర్యాలీకి వెళ్తున్న ఆయన లక్ష్మీపురం గ్రామం వద్ద ఓ చిన్నపిల్లాడిని ఎత్తుకుని తన కారులో ఆడించారు. దీంతో అక్కడివారు ప్రధాని ఔదార్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందించారు. ఆ ఫొటోను ప్రధాని తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. దానికి ‘నా యువ మిత్రుడిని కలిశా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.