పాల్వాయి కుటుంబానికి మంత్రి పరామర్శ

- అనారోగ్యంతో రజిని కుమారి కూతురు ఐశ్వర్య మృతి
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: బీజేపీ నాయకురాలు పాల్వాయి రజిని కుమారితో పాటు ఆమె కుటుంబ సభ్యులను సూర్యాపేట శాసనసభ్యులు, మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో రజనికుమారి ఏకైక కుమార్తె ఐశ్వర్య మృతి చెందింది.
పుట్టెడు దుఃఖంలో ఉన్న రజనికుమారితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దురదృష్ట సంఘటనకు సంబంధించిన వివరాలను రజనీకుమారితో అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, బండారు రాజా, మతకాల చలపతిరావు, అయూబ్ ఖాన్, చింతలపాటి చిన్న శ్రీరాములు, మద్ది శ్రీనివాస్ యాదవ్, బైరు వెంకన్న గౌడ్ ఉన్నారు.