కేసీఆర్ జబర్దస్త్‌గా ఉన్నారు: మంత్రి కేటీఆర్

కేసీఆర్ జబర్దస్త్‌గా ఉన్నారు: మంత్రి కేటీఆర్
  • మనపని మీద ఉన్నారు
  • కాంగ్రెస్‌కు ఓటేస్తే
  • రైతు బంధుకు రామ్ రామ్
  • దళిత బంధుకు జై భీమ్
  • మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి
  • రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్ జబర్దస్త్‌గా ఉన్నారు… మన పని మీదనే పనిచేస్తున్నారు… త్వరలో బయటికి వచ్చి మనకేమేం కావాలో ప్రకటిస్తారు అంటూ రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కేటీఆర్ బహిరంగ సభలో ఈవ్యాఖ్య చేశారు. భూపాల్ పల్లి జిల్లా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ ప్రారంభించిన అనంతరం సోమవారం స్థానికంగా జరిగిన బహిరంగ సభ, తర్వాత పరకాలలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.


కమలమ్మ అనే పెద్దమనిషి బాపు ఎట్లున్నాడు బిడ్డా అని అడిగిందంటూ కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లు మన ఇంటికి వస్తారు. కడుపులో తలకాయ పెడతారు. రెండుసార్లు ఓడిపోయిన, మూడుసార్లు ఓడిపోయిన అని బాధపడుతారు. కాంగ్రెస్ వాళ్లు కాళ్ళ మీద పడతారు, దండం పెడతారు. యాక్టింగ్ బాగా చేస్తారంటూ కేటీఆర్ వివరించారు. వారిని నమ్మితే మన కంట్లో మనవేలితో పొడుస్తారు.


రైతుబంధుకు రాంరాం దళిత బందుకు జై భీమ్. ఈ పథకాలన్నీ ఎక్కడికో పీకుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో ఉన్న కష్టాలన్నీ మళ్ళీ ముందుకు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చెప్పలేని దుస్థితి ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడై మనల్ని నమ్మించేందుకు వస్తున్నాడు. మొన్ననో ఓటుకు నోటు, ఇప్పుడేమో సీటుకు రేటు. ఎవరూ రేవంత్ రెడ్డి అనట్లేదు. రేట్ ఎంత అని పిలుస్తున్నారని విమర్శించారు.


కాంగ్రెస్ వాళ్లకు కర్ణాటక నుంచి పైసలు వస్తున్నాయి. బీజేపీలకు అంబానీ ఆదాయాన్ని పైసలు వస్తున్నాయి. పైసలు తీసుకొని మోసంతోనే జయించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.