మంత్రి మల్లారెడ్డికి కార్పోరేటర్ల షాక్
మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీ కార్పోరేటర్లు ఎన్నికల సమయంలో షాక్ ఇచ్చారు. బోడుప్పల్ కార్పోరేషన్ ఐదుగురు బీఆరెస్ కార్పొరేటర్లు కారు దిగి హస్తం పార్టీలో చేరారు.

విధాత: మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీ కార్పోరేటర్లు ఎన్నికల సమయంలో షాక్ ఇచ్చారు. బోడుప్పల్ కార్పోరేషన్ ఐదుగురు బీఆరెస్ కార్పొరేటర్లు కారు దిగి హస్తం పార్టీలో చేరారు. గురువారం టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డిల అధ్వర్యంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు.