Minister Uttam Kumar Reddy | దేశంలోనే గొప్పగా తెలంగాణలో రుణమాఫీ.. తప్పుడు లెక్కలతో ప్రతిపక్షాల దుష్ప్రచారం: మంత్రి ఉత్తమ్
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని రీతిలో గొప్పగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల 2లక్షల రుణమాఫీ అమలు చేస్తుందని, రాజకీయంగా ఇది సహించలేని ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలతో రుణమాఫీపై దుష్ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నాయని రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు

ప్రక్రియ పూర్తికాకుండానే అసంపూర్ణమంటూ విమర్శలా
Minister Uttam Kumar Reddy | దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని రీతిలో గొప్పగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) రైతుల 2లక్షల రుణమాఫీ (Runa Mafi) అమలు చేస్తుందని, రాజకీయంగా ఇది సహించలేని ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలతో రుణమాఫీపై దుష్ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నాయని రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఎర్రమంజిల్ జలసౌథాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2014 తర్వాత బీజేపీ ఎప్పుడూ రుణమాఫీ గురించి మాట్లాడలేదన్నారు. పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ (BJ) అధికారంలో ఉండి రైతుల కోసం ఎలాంటి మంచి పనులు చేయలేదని విమర్శించారు. గతంలో మన్మోహన్ సింగ్ సర్కారు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిందని గుర్తు చేశారు. బీఆరెస్ (BRS) దశల వారి రుణమాఫీ ప్రక్రియ విఫలమైందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులను రుణవిముక్తులను చేయాలని తాము సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని, వారికి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు తీసుకున్న రుణం , వడ్డీ మొత్తం మేము మాఫీ చేశామన్నారు. గతంలో బీఆరెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తి ఓఆర్ఆర్ అమ్మి రుణమాఫీ చేశారని మంత్రి పేర్కొన్నారు. 2018లో రైతు రుణమాఫీలో అనేక ఫిర్యాదులు వస్తే వాటి పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వెల్లడించారు. రైతులను మోసం చేయడం బీఆరెస్‌కు అలవాటుగా మారిందన్నారు.
సాంకేతిక కారణాలతో రుణమాఫీ ఆలస్యం
లక్షా 20 వేల మంది రైతులు ఆధార్ నంబర్లు తప్పుగా ఇచ్చారని.. లక్షా 61 వేల రైతుల ఆధార్ కార్డుల్లో, అకౌంట్లలో పేర్లలో తప్పులు ఉన్నాయన్నారు. 4 లక్షల 83 వేల మందికి రేషన్ కార్డుల్లో Ration Cards) తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 8 లక్షల అకౌంట్స్ రెండు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నారని.. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారు ఆపై అమౌంట్ కడితే వెంటనే రుణమాఫీ అవుతుందన్నారు. నాడు బీఆరెస్ రుణమాఫీ టోటల్ ఫెయిల్యూర్ అని, నాడు కేసీఆర్ చేసిన రుణమాఫీ రైతుల బ్యాంకు వడ్డీలకే సరిపోయిందని మంత్రి ఉత్తమ్ (Ministr Uttam) విమర్శించారు. పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేశామని, మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేస్తామన్నారు.
రుణమాఫీలో సాంకేతిక సమస్యలను సవరించడానికి ప్రతి మండలంలో మండల వ్యవసాయాధికారులకు బాధ్యతలు అప్పగించామని ఉత్తమ్ చెప్పారు. వారు రుణమాఫీ కానీ రైతుల వివరాలను తీసుకొని పోర్టల్‌లో అప్ లోడ్ చేస్తే రుణమాఫీ చేస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు కచ్చితంగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని మంత్రి తెలిపారు. పంట నష్టం జరిగితే రైతులకు బీఆరెస్ ఒక్క పైసా ఇవ్వలేదని.. నాడు అనేక ఆందోళనలు చేశామని మంత్రి తెలిపారు. ఈ పంట నుంచి సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. రైతులకు పంట నష్టపరిహారం తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇస్తున్నామని వెల్లడించారు.