సాగర్ ఎడమ కాలువ రైతుల ఆయకట్టుకు 20 రోజులు నిరంతరాయంగా నీరివ్వాలని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్.. సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు

  • సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి
  • సీఎంకు మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ విజ్ఞప్తి

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: సాగర్ ఎడమ కాలువ రైతుల ఆయకట్టుకు 20 రోజులు నిరంతరాయంగా నీరివ్వాలని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్.. సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానికంగా ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. వర్షాలు వచ్చి సాగర్ నిండకపోదా అన్న ఆశతో రైతులు చెరువులు, బోర్లు, బావుల కింద నాట్లు వేశారన్నారు. ప్రస్తుతం వరి పొలాలు చిరు పొట్ట దశకు వచ్చాయని, తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నీరందకుండా పోతోందన్నారు.

ఈ దశలో వరికి అధిక నీటి అవసరం ఉంటుందన్నారు. 20 రోజులు నీరివ్వాలని కోరారు. 70 శాతం పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డదని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ రైతు పక్షపాతిగా పంట చిరు పొట్ట దశలో ఎండి పోతే రైతు నష్టపోతాడని డ్యాం డెడ్ స్టోరేజీ ఉన్నా పది రోజులు నీటిని విడుదల చేయించారన్నారు. మరో పది రోజుల తర్వాత నీరు విడుదల చేయడం వల్ల మేజర్ చివర నాట్లు వేసిన వారికి నీరు అందడం ఇబ్బందిగా ఉంటుందన్నారు. మధ్యలో పది రోజులు ఆపి ఇచ్చే బదులు వరుసగా 20 రోజులు నీటిని విడుదల చేస్తే వరి పొలాలు చిరు పొట్ట దశ నుంచి బయటపడతాయని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ బంటు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు సైదిరెడ్డి, గోవిందరెడ్డి, మన్నెం లింగారెడ్డి పాల్గొన్నారు.

Vidhaatha Desk

Vidhaatha Desk

Next Story