అటు ఇటు చేరికల జోష్..

- నేడు కాంగ్రెస్ బీఆర్ఎస్‌లో చేరనున్న ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు
విధాత: ఎన్నికలవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలో పోటాపోటీగా చేరికలు సాగుతున్నాయి. నేడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు లు కాంగ్రెస్లో చేరుతున్నారు.
అటు నేడు సీఎం చంద్రశేఖర్ రావు సమక్షంలో టిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిలు , టీఎన్జీవోస్ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ బీఆర్ఎస్ లో చేరుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో విభేదాలు నేపథ్యంలో చెరుకు సుధాకర్ గౌడ్ కూడా నేడోరేపు బీఆర్ఎస్ లో చేరుతారని సమాచారం.