ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: పోలీసులకు చుక్కెదురు
విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది. సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమోను కోర్టు తిరస్కరించింది. గత నెల 22న నాంపల్లి అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టులో నలుగురిని నిందితులుగా చేరుస్తూ మొయినాబాద్ పోలీస్ శాఖ మెమో దాఖలు చేసింది. ఈ మెమోను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. హైకోర్టులో విచారణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు హైకోర్టులో విచారణ జరిగింది. సిట్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే […]

విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది. సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమోను కోర్టు తిరస్కరించింది. గత నెల 22న నాంపల్లి అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టులో నలుగురిని నిందితులుగా చేరుస్తూ మొయినాబాద్ పోలీస్ శాఖ మెమో దాఖలు చేసింది. ఈ మెమోను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.
హైకోర్టులో విచారణ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు హైకోర్టులో విచారణ జరిగింది. సిట్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పిటిషన్లు దాఖలయ్యాయి.
దర్యాప్తు ఇంకా మొదటి దశలో ఉన్నదని, దర్యాప్తు మధ్యలో ఉన్నప్పుడు సీబీఐకి ఇవ్వాలని ఎలా అడుగుతారని దవే వాదించారు. బీజేపీ కూడా సిట్ జరుపుతున్న దర్యాప్తునకు సహకరించాలని ఆయన కోరారు. నిందుతులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.