పెద్దమ్మా.. కేసీఆర్ పింఛన్ పెంచుతుండు: శ్రీనివాస్ గౌడ్

పెద్దమ్మా.. కేసీఆర్ పింఛన్ పెంచుతుండు: శ్రీనివాస్ గౌడ్
  • కారు గుర్తుకే ఓటేయ్..
  • పాలమూరు బీఆరెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్


(విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి): పాలమూరు బీఆరెస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. శనివారం ఉదయం పాలమూరు పట్టణంలో గడప గడపా చుట్టేశాడు. ఈ క్రమంలో మంత్రికి ఓ వృద్ధురాలు ఎదురైంది. ఆమె వద్దకు వెళ్లి, కరపత్రంలోని తన ఫొటో చూపిస్తూ.. ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘పెద్దమ్మా… గుర్తుపట్టావా? నేను మీ శ్రీనివాస్ గౌడ్ ను… ఈ ఫొటో చూసావా… నేను బాగున్నానా?’ అంటూ వృద్ధురాలిని శ్రీనివాస్ గౌడ్ పలకరించాడు.


‘పదేళ్లు పాలమూరు ప్రజలకు సేవ చేశా.. మీలాంటి పెద్దమ్మల కోసం కేసీఆర్ పింఛన్ పెంచుతుండు…. మీ పెద్ద కొడుకుగా తల్లులకు ఎంతో అభిమానoతో పింఛన్ ఐదు వేల వరకు చేస్తుండు… అందుకే మళ్ళీ కారు గుర్తుకు ఓటు వేయాలి…. పెద్దమ్మా గుర్తు పెట్టుకో’ అంటూ చేతులెత్తి నమస్కరించాడు. నేలపైన కూర్చున్న ఆ అవ్వ.. కరపత్రంలోని మంత్రిగారి ఫొటో చూస్తుండిపోతూ… శ్రీనివాస్ గౌడ్ ను ఆశీర్వదించి పంపింది. వృద్ధురాలితో మంత్రి సంభాషణ స్థానికులకు ఆసక్తిని రేకెత్తించింది.