పార్టీలు చేసుకుంటారు, నీటి వివాదాలు మాట్లాడకోరా? కిషన్‌రెడ్డి
విధాత,హైదరాబాద్:‘ఆస్తులు పంచుకోవడంతో పాటు దావత్‌లు చేసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌లు, జల వివాదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదా?’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిలదీశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ఇద్దరు సీఎంలు ఏ ఒప్పందం చేసుకున్నారోగానీ ఆంధ్ర ప్రజలను రాక్షసులుగా, ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. నీటి వివాదాల పరిష్కారం కోసం కేంద్రం సహకరిస్తుంది. ఇద్దరు సీఎంలు కూర్చోండి.. ఏ రాష్ట్రానికి రావాల్సిన వాటా పొందే […]

విధాత,హైదరాబాద్:‘ఆస్తులు పంచుకోవడంతో పాటు దావత్‌లు చేసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌లు, జల వివాదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదా?’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిలదీశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ఇద్దరు సీఎంలు ఏ ఒప్పందం చేసుకున్నారోగానీ ఆంధ్ర ప్రజలను రాక్షసులుగా, ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. నీటి వివాదాల పరిష్కారం కోసం కేంద్రం సహకరిస్తుంది. ఇద్దరు సీఎంలు కూర్చోండి.. ఏ రాష్ట్రానికి రావాల్సిన వాటా పొందే హక్కు ఆ రాష్ట్రానికి ఉంటుంది’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల వివాదంపై ప్రజలను రెచ్చగొడుతూ సీఎం కేసీఆర్ తన పాలనా వైఫల్యాన్ని ఆంధ్ర ప్రజలపై నెడుతున్నారని విమర్శించారు.