పోచంపల్లి ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతా: MLA శేఖర్ రెడ్డి
విధాత: ప్రపంచ ప్రసిద్ధ చేనేత, పట్టు వస్త్రాల కేంద్రమైన పోచంపల్లి పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా, ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామంలో చెరువు కట్ట వద్ద లేక్ వ్యూ పార్క్ ను ఆయన జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలసత్పతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మున్సిపాలిటీలు, గ్రామాలు అభివృద్ధి […]

విధాత: ప్రపంచ ప్రసిద్ధ చేనేత, పట్టు వస్త్రాల కేంద్రమైన పోచంపల్లి పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా, ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామంలో చెరువు కట్ట వద్ద లేక్ వ్యూ పార్క్ ను ఆయన జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలసత్పతితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మున్సిపాలిటీలు, గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. శని, ఆదివారాలలో హైదరాబాదు నుంచి, ఇతర ప్రదేశాల నుంచి పోచంపల్లి పట్టుచీరలు కొనడానికి ఎక్కువగా ప్రజలు వస్తారని, వారు వెళ్లేటప్పుడు జలాలపురంలో ఉన్న పార్కులో సేద తీరుతూ పిల్లలతో సంతోషంగా గడపవచ్చన్నారు.
ఈ పార్క్‌ను ఇంకా అభివృద్ధి పరుస్తూ చెరువులో ఒక వంతెన నిర్మించి దానిపై సోలార్ సిస్టం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అభివృద్ధి అంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే, సీఎం కెసిఆర్ నాయకత్వంలో జరుగుతుందన్నారు.