నాగార్జున సాగర్ లో RAF ఫ్లాగ్ మార్చ్
విధాత: నాగార్జునసాగర్ విజయపురి హిల్ కాలనీ, పైలాన్ కాలనీ లో నాగార్జునసాగర్ విజయపురి నార్త్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం తో పాటు ప్రముఖ చారిత్రాత్మక మైన నాగార్జునసాగర్ ప్రదేశాలను సందర్శించడం, ఏరియా గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ లను సందర్శించి అక్కడి పోలీస్ సిబ్బందికి విధులలో భాగంగా వారు ఉపయోగించే స్వీయరక్షణ పరికరాలు, అధునాతన ఆయుధాల ప్రాముఖ్యత, వాటి పనితీరు గురించి […]

విధాత: నాగార్జునసాగర్ విజయపురి హిల్ కాలనీ, పైలాన్ కాలనీ లో నాగార్జునసాగర్ విజయపురి నార్త్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం తో పాటు ప్రముఖ చారిత్రాత్మక మైన నాగార్జునసాగర్ ప్రదేశాలను సందర్శించడం, ఏరియా గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ లను సందర్శించి అక్కడి పోలీస్ సిబ్బందికి విధులలో భాగంగా వారు ఉపయోగించే స్వీయరక్షణ పరికరాలు, అధునాతన ఆయుధాల ప్రాముఖ్యత, వాటి పనితీరు గురించి అక్కడి సిబ్బందికి తెలియజేశారు.
నాగార్జునసాగర్ లో విజయపురి నార్త్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గౌరీ నాయుడు,సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరసింహారావు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్ ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ కె పి సుధా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సామరస్యాన్ని పెంపొందించేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎప్పుడైనా, ఏవైనా వివాస్పదమైన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేందుకు అనువుగా రాపిడ్ యాక్షన్ఫోర్స్ (ఆర్ ఏఎఫ్) దళాలు కవాత్ చేస్తున్నట్లు తెలిపారు. బజార్ నుండి బయల్దేరి పట్టణంలోని ప్రధాన వీధులగుండా కవాతు చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ కె పి సుధా డిప్యూటీ కమాండర్ ఇన్స్పెక్టర్ రామ్ నివాస్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.