Raja Singh | హైదరాబాద్‌లోనూ ఢిల్లీ తరహా కోచింగ్ సెంటర్లు: ఎమ్మెల్యే రాజాసింగ్
ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ తరహాలోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ అలాంటి కోచింగ్ సెంటర్లు ఉన్నాయని, కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగి చూసిచూడనట్లుగా వ్యవహారిస్తున్నారని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు

టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రేక్షక పాత్ర
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు
విధాత, హైదరాబాద్ : ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ తరహాలోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ అలాంటి కోచింగ్ సెంటర్లు ఉన్నాయని, కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగి చూసిచూడనట్లుగా వ్యవహారిస్తున్నారని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కార్పోరేషన్ అవినీతిమయమైందని, హైదరాబాద్‌లో కూడా అనేక అక్రమ కోచింగ్ సెంటర్లు నడస్తున్నాయని ఆరోపించారు.
అధికారులకు ఫిర్యాదు చేస్తే లంచాలు తీసుకొని వదిలేస్తున్నారని, టౌన్ ప్లానింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేయాలని కోరారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ తరహా ఘటనలు ఇక్కడ కూడా జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. సివిల్స్ కోచింగ్ కోసం వెళ్లి మృతి చెందిన తెలంగాణ యువతి తన్యా సోని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.