ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు బుధవారం వేతనాలు అందాయి.ఇటీవలి కాలంలో ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు ఇంత ఆలస్యంగా వేతనాలు చెల్లించడం ఇదే తొలిసారి. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్,కర్ఫ్యూలను విధించడంతో ఆర్టీసీ ఆదాయం అనూహ్యంగా పడిపోయింది. కరోనా తొలిదశలోనూ ఆదాయం తగ్గినా ప్రభుత్వం ప్రతి నెలా రూ.100 కోట్ల వరకు విడుదల చేయడంతో ఉద్యోగులకు ఏడెనిమిది తేదీల్లో వేతనాలు అందేవి. కొవిడ్ రెండోదశలో కూడా లాక్‌డౌన్, కర్ఫ్యూ కారణంగా ఆదాయం మరింత తగ్గిపోయింది. ఫలితంగా ఆర్టీసీ […]

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు బుధవారం వేతనాలు అందాయి.ఇటీవలి కాలంలో ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు ఇంత ఆలస్యంగా వేతనాలు చెల్లించడం ఇదే తొలిసారి. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్,కర్ఫ్యూలను విధించడంతో ఆర్టీసీ ఆదాయం అనూహ్యంగా పడిపోయింది. కరోనా తొలిదశలోనూ ఆదాయం తగ్గినా ప్రభుత్వం ప్రతి నెలా రూ.100 కోట్ల వరకు విడుదల చేయడంతో ఉద్యోగులకు ఏడెనిమిది తేదీల్లో వేతనాలు అందేవి. కొవిడ్ రెండోదశలో కూడా లాక్‌డౌన్, కర్ఫ్యూ కారణంగా ఆదాయం మరింత తగ్గిపోయింది.
ఫలితంగా ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల చెల్లింపు సమస్యగా మారింది. బ్యాంకుల నుంచి రూ.1000 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం నెలన్నర కిందట అనుమతి ఇచ్చినప్పటికీ బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు రుణం కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉద్యోగులకు వేతనాలు, పీఎఫ్, ఇతర భత్యాలు కలిపి ప్రతి నెలా రూ.220 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం వేతనాల కిందే నెలకు రూ.125 కోట్ల వరకు చెల్లించాలి. మరోవైపు పీఎఫ్ సొమ్మును ఉద్యోగుల వేతనాల నుంచి కోత విధిస్తున్నా ఆ మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం లేదు.