రైస్​ మిల్లర్​ శ్రీధర్​ గుప్తా చంపుతానని బెదిరిస్తున్నాడు.. SPకి మెదక్ మున్సిపల్ చైర్మన్ ఫిర్యాదు

విధాత, మెదక్ బ్యూరో: రైస్ మిల్లర్ (Rice Miller) శ్రీదర్ గుప్త (Sridhar Gupta)పై మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గుప్తా (Chandrapal Gupta) జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని (Sp Rohini Priyadarshini)కి ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా వున్నాయి. నర్సాపూర్‌ (Narsapur)కు చెందిన రైస్​ మిల్లర్​ శ్రీధర్​ గుప్తా తనను చంపుతానని బెదిరిస్తున్నాడని మెదక్​ మున్సిపల్​ చైర్మెన్​, రైస్​ మిల్లర్స్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు తొడుపునూరి చంద్రపాల్​ సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ […]

రైస్​ మిల్లర్​ శ్రీధర్​ గుప్తా చంపుతానని బెదిరిస్తున్నాడు.. SPకి మెదక్ మున్సిపల్ చైర్మన్ ఫిర్యాదు

విధాత, మెదక్ బ్యూరో: రైస్ మిల్లర్ (Rice Miller) శ్రీదర్ గుప్త (Sridhar Gupta)పై మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గుప్తా (Chandrapal Gupta) జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని (Sp Rohini Priyadarshini)కి ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా వున్నాయి. నర్సాపూర్‌ (Narsapur)కు చెందిన రైస్​ మిల్లర్​ శ్రీధర్​ గుప్తా తనను చంపుతానని బెదిరిస్తున్నాడని మెదక్​ మున్సిపల్​ చైర్మెన్​, రైస్​ మిల్లర్స్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు తొడుపునూరి చంద్రపాల్​ సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ రైస్​మిల్​ వ్యాపారం చేస్తున్నశ్రీధర్​ గుప్తా కస్టం మిల్లింగ్​ రైస్​ (సీఎంఆర్​) కోసం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని మూడు మిల్లులలో దింపుకొని ప్రభుత్వానికి బియ్యాన్ని సరఫరా చేస్తాడని తెలిపారు. కాగా బియ్యం సివిల్ సప్లయ్​ కార్పోరేషన్‌కు సరఫరా చేసే సందర్భంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు.

దీంతో తాను నిబంధనలకు విరుద్దంగా సీఎంఆర్​ తీసుకోవద్దని జిల్లా రైస్​ మిల్లర్స్​ అసోసియేషన్​ తరపున అడిషనల్​ కలెక్టర్​, జిల్లా సివిల్​ సప్లై ఆఫీసర్​ లకు సూచించానన్నారు. దీంతో శ్రీధర్​ గుప్తా తనపై ద్వేశం పెంచుకుని బీహార్ హమాలీలతో తనను చంపించాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

ఈ విషయమై అతను ఇతర మిల్లర్ల ముందు మాట్లాడిన విషయాన్నిమరో రైస్ మిల్లు యజమాని నోముల పాండురంగం విని గత జనవరి 19వ తేదీన తనకు వాట్సాప్ మెసేజ్​ ద్వారా తెలిపారని చంద్రపాల్ వివరించారు. అయితే తాను ఇది పిల్ల చేష్టగా భావించి ఊరుకున్నాన‌ని తెలిపారు.

కాగా ఆదివారం శ్రీధర్​ గుప్తా నిన్ను వదిలి పెట్టే ప్రస్తక్తే లేదని బెదిరిస్తూ వాట్సప్​ మెసేజ్​ పెట్టారని చంద్రపాల్​ తెలిపారు. వాట్సాప్ మెసేజ్​ ప్రూఫ్​ లను, ఆడియో మెసేజ్‌లను పెన్ డ్రైవ్ ద్వారా ఎస్పీ ఆఫీస్​లో అందజేసినట్టు వివరించారు. తనను చంపుతానని బెదిరించిన శ్రీధర్​ గుప్తాపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ చంద్రపాల్​ టౌన్​ పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.