బుధవారం ఉదయం సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల

నాగార్జున సాగర్ ఎడమ కాలువలకు పడ్డ గండ్ల నిర్వహకం పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆరెస్ పాలకులదేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

బుధవారం ఉదయం సాగర్ ఎడమకాలువకు  నీటి విడుదల

సాగర్ ఎడమ కాలువ గండ్ల పాపం బి.ఆర్.యస్ నిర్వాకమే
త్వరలో 1800 మంది లష్కారుల నియామకాలు
వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నాగార్జున సాగర్ ఎడమ కాలువలకు పడ్డ గండ్ల నిర్వహకం పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆరెస్ పాలకులదేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పదేళ్ళ పాలనలో నీటిపారుదల శాఖను నిర్లక్ష్యం చేసిన కారణంగానే నేడు ఈ దుస్థితి సంభవించిందని ఆయన దుయ్యబట్టారు. కాలువల నిర్వహణ, పర్యవేక్షణ లను గాలికి వదిలిన పాప ఫలితమే సాగర్ ఆయకట్టు రైతాంగానికి శాపంగా పరిణమించిందన్నారు. లోపభూయిష్టమైన నిర్వహణకు పరాకాష్ట కాగితం రామచంద్రాపురం,రంగుండ్ల ఉదంతాలన్నారు.

వర్షపు బీభత్సంతో ఎడమ కాలువకు పడ్డ గండ్లకు జరుగుతున్న మరమ్మతులను మంగళవారం కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ తో కలసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం కాగితం రామచంద్రపురం,సూర్యాపేట-ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో 133.3 కిలో మీటర్ల వద్ద ఉన్న రంగుల బ్రిడ్జి,కోదాడ మండలం ఆర్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్లకుంట మేజర్,చిలుకూరు మండలం నారాయణపురం చెరువు మరమ్మతుల పనులతో పాటు హుజుర్ నగర్ మండలం కరక్కాయలగూడెం గ్రామంలోనీ ముక్త్యాల బ్రాంచ్ మేజర్ కు జరుగుతున్న మరమ్మతుల పనులను పరిశీలించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,నీటిపారుదల శాఖాధికారి రమేష్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

పదేళ్లలో కాలువల. మరమ్మతులు జరగని కారణంతో పాటుఇంజినీర్ల నియామకాలు,లష్కర్ల నియమాకాలు జరిగనందునే ఉంటే నేడు ఈ దుస్థితి సంభవించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిందే తడవుగా 700 మంది ఇంజినీర్లను,1800 మంది లష్కరులను నిమించమన్నారు. ఈ గురువారం ఎర్రమంజిల్ కాలనీ లోని జలసౌద లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపు పత్రాలు అందజేయనున్నట్లు ఆయన వెళ్ళడించారు.

మాది ముమ్మాటికీ రైతుపక్షపాత ప్రభుత్వమని 50 ఏండ్ల తరువాత సంభవించిన విపత్తులో రైతులను ఆదుకోవడానికి గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వాతావరణ శాఖ రెడ్ ఎలెర్ట్ ప్రకటించిన మరుక్షణం నుండి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టామన్నారు.

గండ్లుపడిన ప్రాంతాలను ఆఘమేఘాల మీద సందర్శించడంతో పాటు యుద్ద ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టామన్నారు. షార్ట్ టెండర్లు పిలిచి మరమ్మతులు మొదలు పెట్టమన్నారు.ఈ రోజు సాయంత్రం వరకు పనులు పూర్తి అవుతాయన్నారు. బుధవారం ఉదయం నుండి సాగర్ నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇదంతా వదిలి పెట్టి వరదలను రాజకీయాలు చేయడం వారికే చెల్లిందన్నారు.