రైల్వే శాఖలో సంచలనం .. తొలిసారిగా సీబీఐ అదుపులో ఉన్నత స్థాయి అధికారులు

రైల్వేశాఖ చరిత్రలో మొదటిసారిగా రైల్వే ఉన్నతస్థాయి అధికారులు సీబీఐకి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడడం సంచలం కలిగిస్తుంది. గుత్తేదారుడి నుంచి భారీగా లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన సంఘటన గుంతకల్లు రైల్వే కార్యాలయంలో చోటు చేసుకుంది.

రైల్వే శాఖలో సంచలనం .. తొలిసారిగా సీబీఐ అదుపులో ఉన్నత స్థాయి అధికారులు

విధాత : రైల్వేశాఖ చరిత్రలో మొదటిసారిగా రైల్వే ఉన్నతస్థాయి అధికారులు సీబీఐకి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడడం సంచలం కలిగిస్తుంది. గుత్తేదారుడి నుంచి భారీగా లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన సంఘటన గుంతకల్లు రైల్వే కార్యాలయంలో చోటు చేసుకుంది. ప్రధానమంత్రి గతిశక్తి పథకంలో భాగంగా గుంతకల్లు డివిజన్‌ పరిధిలో రూ. 500 కోట్లతో రైలు వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను గుత్తేదారు రమేశ్‌ తో పాటు మరో 11 మంది పనులను దక్కించుకున్నారు. గుత్తేదారుల నుంచి గుంతకల్లు డీఆర్‌ఎం వినీత్‌ సింగ్‌, డీఎఫ్‌ఎం ప్రదీప్‌బాబు , రైల్వే అధికారులు యు. అక్కిరెడ్డి, ఎం.బాలాజీ. డి.లక్ష్మీపతిరాజు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో గుత్తేదారుడు రమేశ్‌ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ముకుమ్మడిగా రైల్వే కార్యాలయంపై దాడులు నిర్వహించారు. గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. గత మూడు రోజులుగా కార్యాలయంలో సోదాలు జరిపిన సీబీఐకి ఆధారాలు దొరకడంతో పాటు నగదు, బంగారు లభించడంతో వారిని అరెస్టు చేశారు. నిందితుల కుటుంబ సభ్యులను పిలిపించి వారికి సీబీఐ అధికారులు ఘటనా వివరాలను వెల్లడించారు. నిందితులందరిని వైద్య పరీక్షల నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను సీబీఐ కోర్టుకు తరలించనున్నారు.