Mucherla | ముచ్చర్లలో మరో మహానగరం

హైదరాబాద్​ రాజధాని ప్రాంతంలో(Hyderabad Capital Region) మరో నగరం రాబోతోంది. ఇప్పటికే హైదరాబాద్​, సికింద్రాబాద్​, సైబరాబాద్​(Tri-Cities) లతో అలరారుతున్న మహానగరానికి మణిపూసగా నాలుగో నగరాన్ని(Fourth City) నిర్మించబోతున్నట్లు,  దుబాయ్​, సింగపూర్​లను తలదన్నే అద్భుత నగరం ముచ్చర్లలో వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రకటించారు

Mucherla | ముచ్చర్లలో మరో మహానగరం

విధాత, హైదరాబాద్‌:   హైదరాబాద్‌ మహానగర  అభివృద్ధిలో భాగంగా ముచ్చర్లలో(Mucherla) మరో నగరాన్ని ఇక్కడ నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. నగర నిర్మాణం కోసం విద్య, వైద్యం, మౌలిక వసతులను కల్పించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రాంతం ప్యూచర్‌ సిటీ(Future City)గా మారబోతుందని, న్యూయార్క్‌ నగరం కన్నా అధునాతన నగరం (Better than New York) ఇక్కడ వస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ ఖాన్‌ పేట్‌(Meerkhan pet) లో గురువారం నాడు యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ(Yound India Skills University-PPP model)కి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం మల్లు భట్టితో కలిసి భూమి పూజ చేశారు.  కందుకూరు  ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న ఆశయంతో యంగ్‌ ఇండియా స్కిల్స్​ యూనివర్సిటీ(Yound India Skills University)ని ఇక్కడ  ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు. నెట్ జీరో సిటీ (Net Zero City) ఆవరణలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్,  ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్ లకు కూడా శంకుస్థాపన చేశారు. వేర్వేరు రంగాలలో 15 అత్యాధునిక కోర్సులను(15 courses in different verticals) ఇందులో అందిస్తామన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో రీజనల్‌ రింగ్‌ రోడ్డు(Regional Ring Road) పనులు కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు చేపట్టి పూర్తి చేశామని, మళ్లీ కాంగ్రెస్‌ హయాంలోనే రీజనల్‌ రింగ్‌ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నామన్నారు.

మీ భవిషత్తుకు మాదీ భరోసా

భూములు కోల్పోయిన రైతులకు(Land Losers) మాట ఇస్తున్నానని, వారి భవిష్యత్‌ కు భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. పిల్లలకు నైపుణ్య శిక్షణ(Skill Training) ఇప్పించి ఉద్యోగాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక్కడి నుంచి శంషాబాద్‌ లోని అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA) వరకు రెండొందల ఫీట్ల రోడ్డు వేస్తామని, మెట్రో రైలు(Metro Rail Connectivity)ను కూడా తెస్తామని చెప్పారు. ఇవాళ శాసన సభలో బిల్లును ఆమోదించుకుని స్కిల్‌ యూనివర్సీటీ ఏర్పాటు చేస్తున్నామని,  స్కిల్‌ యూనివర్సిటీ ద్వారా లక్షలాది మంది యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించనున్నామని అన్నారు. ఇక్కడ సీటు వచ్చిందంటే ఉద్యోగం తప్పక లభిస్తుందన్న సీఎం, ఆనాడు దేశంలో మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ విద్యకు అధిక  ప్రాధాన్యమిచ్చారన్నారు. హైదరాబాద్‌ ప్రజల దాహర్తిని తీర్చేందుకు కృష్ణా, గోదావరి జలాలను తీసుకువచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం  భట్టివిక్రమార్క,శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు తీపి కబురు,ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాలవ్యవధిలో ఉద్యోగ నియామకాలు : మంత్రులు పొంగులేటి, పొన్నం

త్వరలో కొత్త రేష‌న్ కార్డుల జారీకి మార్గ‌ద‌ర్శ‌కాలు.. కొత్త‌గా పెళ్లైన దంప‌తులు రేష‌న్ కార్డు పొంద‌డం ఎలా..?