కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం- సీఎం కేసీఆర్
విధాత : తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి, రైతుకు యంత్రాంగం అండగా నిలబడాలని సూచించారు. ప్రజా అవసరాలకు కేటాయించిన భూములను రిజిస్ట్రేషన్ చేయాలి. పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలి. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ శాఖ, పోలీసులు కల్తీ విత్తనాలను అరికట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు […]

విధాత : తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి, రైతుకు యంత్రాంగం అండగా నిలబడాలని సూచించారు. ప్రజా అవసరాలకు కేటాయించిన భూములను రిజిస్ట్రేషన్ చేయాలి. పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలి. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ శాఖ, పోలీసులు కల్తీ విత్తనాలను అరికట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలు వాడాలన్నారు.
పోడు భూములపై సమగ్ర నివేదిక
పోడు భూముల సమస్య పరిష్కారానికి సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులు గుర్తించాలని చెప్పారు. అటవీ భూముల హద్దులు గుర్తించాలని అటవీశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.