Kota Krishna Reddy | సాయుధ పోరాట యోధుడు కోట కృష్ణారెడ్డి మృతి

తెలంగాణ సాయుధ పోరాట యోధులు కోట కృష్ణారెడ్డి(98) మృతి చెందారు. వయోభారంతో కూడిన అనారోగ్యంతో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు

Kota Krishna Reddy | సాయుధ పోరాట యోధుడు కోట కృష్ణారెడ్డి మృతి

విధాత, హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధులు కోట కృష్ణారెడ్డి(98) మృతి చెందారు. వయోభారంతో కూడిన అనారోగ్యంతో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణారెడ్డి స్వగ్రామం సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల కాగా, జైలు జీవితం అనంతరం వరంగల్ జిల్లా నర్సంపేట తాలుకా పసిరిలో స్థిరపడ్డారు. కొంతకాలంగా హైదరాబాద్‌లోని తన కుమారుడి ఇంట్లో ఉంటున్నారు.

నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో చురుకుగా పనిచేసిన కృష్ణారెడ్డి సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపాడు. నల్లగొండ, వరంగల్‌లోని జైళ్లతో పాటు నాటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న మహారాష్ట్రలోని జాల్నా జైలులో కూడా జైలు శిక్ష అనుభవించారు. కృష్ణారెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు గుంటకండ్ల పిచ్చిరెడ్డికి సహచరుడు. కృష్ణారెడ్డి మృతి పట్ల బుర్కచర్ల, పసిరి గ్రామస్తులతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన సహచరులు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.