పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్‌

తెలంగాణ పోలీస్ శాఖ పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కేటగిరిల వారిగా ఏకంగా 50నుంచి 90శాతం రాయితీలు ప్రకటించింది.

పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్‌

విధాత : తెలంగాణ పోలీస్ శాఖ పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కేటగిరిల వారిగా ఏకంగా 50నుంచి 90శాతం రాయితీలు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90వాతం రాయితీ, టూవీలర్లపై 80శాతం, ఆటోలు, ఫోర్ వీలర్స్‌కు 60శాతం, భారీ వాహానాలపై 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది.


అయితే డిసెంబర్ 26నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ డిస్కౌంట్‌లు పొందేందుకు వాహనాదారులు తమ పెండింగ్ చలాన్లు చెల్లించాల్సివుంటుంది. గతంలోనూ ఈ రకమైన డిస్కౌంట్ ప్రకటించిన సందర్భంగా పెద్ద ఎత్తున చలాన్ల వసూలు జరగడంతో మరోసారి ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించింది