Ration Cards | రేష‌న్ కార్డులు ఇక‌ క‌నుమ‌రుగు..! అసలేంటీ తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు..?

Ration Cards | ప్ర‌స్తుతం తెలంగాణ‌( Telangana )లో ప్ర‌తి ఒక్క‌రి నోట వినిపిస్తున్న మాట ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు( TG Family Digital Card ) . ఈ కార్డు ఓకే.. మ‌రి రేష‌న్ కార్డు( Ration Card ) సంగ‌తి ఏంటి..? అస‌లు కొత్త రేష‌న్ కార్డులు( New Ration Cards ) జారీ చేస్తారా..? లేదా..? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్ర‌క‌ట‌న చూసిన త‌ర్వాత కొత్త రేష‌న్ కార్డుల జారీ లేన‌ట్టే అనిపిస్తుంది.

Ration Cards | రేష‌న్ కార్డులు ఇక‌ క‌నుమ‌రుగు..! అసలేంటీ తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు..?

Ration Cards | తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం( Telangana Govt ) అందించే అన్ని సంక్షేమ ప‌థ‌కాలు( Welfare Schemes ) ఒకే కార్డు ద్వారా అందుబాటులోకి వ‌చ్చేలా రేవంత్ రెడ్డి స‌ర్కార్( Revanth Reddy Govt ) ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు( TG Family Digital Card )ల‌ను తీసుకురావాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు( Family Digital Card )ను కుటుంబంలోని మ‌హిళ పేరు మీద జారీ చేయాల‌ని రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అధికారుల‌ను ఆదేశించారు. అయితే ఇప్పుడు సందేహ‌మంత.. రేష‌న్ కార్డు( Ration Card )ల‌పైనే ఉంది. అస‌లు రాష్ట్రంలో కొత్త‌గా రేష‌న్ కార్డుల‌ను జారీ చేస్తారా..? లేదా ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో రేష‌న్ కార్డుల‌ను భాగం చేస్తారా..? ప్ర‌స్తుతం ఉన్న 80 ల‌క్ష‌ల రేష‌న్ కార్డుల‌ను ఏం చేయ‌బోతున్నారు..? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కాలంటే.. సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌ను ఒక్క‌సారి గుర్తు చేసుకోక త‌ప్ప‌దు. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు( Family Digital Card ) పైల‌ట్ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా రేవంత్ ఏమ‌న్నారంటే.. రాష్ట్రంలో అన్ని సేవలు ఒకే కార్డులో అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డులను తీసుకురావాలని నిర్ణయించిన‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రేష‌న్ కార్డు( Ration Card ), ఆస‌రా పెన్ష‌న్లు( Aasara Pensions ), రైతు భ‌రోసా( Rythu Bharosa ), రుణ‌మాఫీ( Crop Loans ), రైతు బీమా( Rythu Bhima ), క‌ల్యాణ‌ల‌క్ష్మి( Kalyana Lakshmi ), షాదీ ముబార‌క్, ఆరోగ్య శ్రీ‌( Arogya Sree ), కంటి వెలుగు, ఫీజు రియింబ‌ర్స్‌మెంట్, హెల్త్ ప్రొఫైల్( Health Profile ).. ఇలా అన్నీ సేవలు ఒకే కార్డులో అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ కార్డులో కుటుంబానికి చెందిన సభ్యుల వివరాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో యునిక్‌ నెంబర్( Unique Number ) ఉంటుంది. అన్నీ కలిపి చూపించేలా ఓ క్యూఆర్ కోడ్( QR Code ) ఉంటుంది. అది స్కాన్ చేస్తే ఆ ఫ్యామిలీకి వస్తున్న పథకాలు, ఏ పథకానికి ఎవ‌రు అర్హులు..? అస‌లు ఆ కుటుంబానికి రేషన్ కార్డు( Ration Card ) ఉందా..? లేదా..? అనే వివరాలు తెలిసి పోతాయ‌న్నారు.

కేసీఆర్( KCR ) అధికారంలో ఉంటే రేష‌న్ కార్డు రాద‌ని ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీ( Congress party )కి అధికారం ఇచ్చారు. కొత్త‌గా రేష‌న్ కార్డులు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు( Govt Schemes ) అర్హుల‌కు అంద‌డం లేదు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు డిజిట‌ల్ కార్డులు( Digital Cards ) అవ‌స‌రం. ప్ర‌తి పేద‌వాడికి డిజిట‌ల్ కార్డు అందించాల‌నే ఉద్దేశంతో ఉన్నాం. ఇక గ్రామాల నుంచి ఉపాధి కోసం ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కు వ‌చ్చిన పేద‌లు ఉన్న ప్రాంతంలోనే రేష‌న్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబ‌ట్టి ఈ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులోనే రేష‌న్ కార్డు వివ‌రాల‌ను పొందుప‌రిస్తే.. ఒకే ఒక్క కార్డుతో ఎక్క‌డి నుంచైనా రేష‌న్ తీసుకోవ‌చ్చు అని రేవంత్ రెడ్డి తెలిపారు.

అంటే సీఎం వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే.. కొత్త రేష‌న్ కార్డుల జారీ ప్ర‌క్రియ లేన‌ట్టే. కొత్త‌గా జారీ చేసే ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో న‌మోదైన వివ‌రాల ఆధారంగా రేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఉన్న 80 ల‌క్ష‌ల రేష‌న్ కార్డుల‌ను ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుకు అనుసంధానం చేస్తామ‌ని ప్రభుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. దీంతో రాష్ట్రంలో రేష‌న్ కార్డులు క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశం ఉంది. పాత రేష‌న్ కార్డులు ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో అనుసంధానం కానున్నాయి.