టీ ఖర్చు రోజుకు 2 లక్షలు ఎక్కడో తెలుసా?

హైదరాబాద్,విధాత‌:ప్రొటోకాల్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తోందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) సెక్రటరీ పద్మానాభరెడ్డి ఆరోపించారు. 2021-22 ఏడాదిలో రాష్ట్రానికి గెస్ట్‌లు వచ్చినప్పుడు, సెక్రటేరియెట్‌లో తరుచూ మీటింగ్‌లు నిర్వహించినప్పుడు టీ, బిస్కెట్ల కోసమే ప్రొటోకాల్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.8 కోట్లు ఖర్చు చేస్తోందని, అంటే రోజుకు రూ.2 లక్షలని చెప్పారు. ఈ డిపార్ట్‌మెంట్‌ అవసరానికి మించి ఖర్చు చేస్తున్నట్లు అర్థమవుతోందని చెప్పారు. వీటిపై ఏసీబీ లేదా విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌ ద్వారా విచారణ జరిపించాలని గవర్నర్‌కు […]

టీ ఖర్చు రోజుకు 2 లక్షలు ఎక్కడో తెలుసా?

హైదరాబాద్,విధాత‌:ప్రొటోకాల్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తోందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) సెక్రటరీ పద్మానాభరెడ్డి ఆరోపించారు. 2021-22 ఏడాదిలో రాష్ట్రానికి గెస్ట్‌లు వచ్చినప్పుడు, సెక్రటేరియెట్‌లో తరుచూ మీటింగ్‌లు నిర్వహించినప్పుడు టీ, బిస్కెట్ల కోసమే ప్రొటోకాల్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.8 కోట్లు ఖర్చు చేస్తోందని, అంటే రోజుకు రూ.2 లక్షలని చెప్పారు. ఈ డిపార్ట్‌మెంట్‌ అవసరానికి మించి ఖర్చు చేస్తున్నట్లు అర్థమవుతోందని చెప్పారు. వీటిపై ఏసీబీ లేదా విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌ ద్వారా విచారణ జరిపించాలని గవర్నర్‌కు పద్మనాభరెడ్డి శనివారం లేఖ రాశారుప్రొటోకాల్ డిపార్ట్‌మెంట్‌కు వెహికల్స్ ఉన్నప్పటికీ వీఐపీలు వచ్చినప్పుడు కాస్ట్‌ లీ వెహికల్స్‌ను రెంట్‌కు తీసుకుంటున్నారని, వీటి కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.8.9 కోట్లు కేటాయించారని తెలిపారు.