మా ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను కాపీ కొట్టారు

తమ పార్టీ ప్ర‌క‌టించిన 6 గ్యారెంటీలు, మ్యానిఫెస్టోను కాపీ కొట్టి ప్ర‌చారం చేస్తున్న స్వ‌తంత్ర అభ్య‌ర్థి అల్లూరి సంజీవ్‌రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాంగ్రెస్

మా ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను కాపీ కొట్టారు
  • స్వ‌తంత్ర అభ్య‌ర్థి అల్లూరి సంజీవ్‌రెడ్డిపై ఫిర్యాదు


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన ఆరు గ్యారంటీ హామీలు, ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను కాపీ కొట్టి ప్ర‌చారం చేసుకుంటున్న‌ స్వ‌తంత్ర అభ్య‌ర్థి అల్లూరి సంజీవ్‌రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆపార్టీ నాయకులు కోరారు. ఈమేరకు ఆదివారం ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల రిటర్నింగ్ అధికారి స్ర‌వంతికి టీపీసీసీ కోఆర్డినేట‌ర్ కే వెంక‌టేష్‌, ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, అసెంబ్లీ అబ్జ‌ర్వ‌ర్ మున్నా అబ్సాస్ హుస్సేన్ ఫిర్యాదు చేశారు.


మ్యానిఫెస్టో ద్వారా సాధార‌ణ ప్ర‌జ‌లు, ఓట‌ర్ల‌ను గంద‌ర‌గోళానికి గురిచేస్తున్నార‌ని, ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌ల‌ప‌ర్చిన‌ కంది శ్రీ‌నివాస‌రెడ్డికి న‌ష్టం చేకూర్చేవిధంగా ఉన్నందున ప‌రిశీలించి, విచార‌ణ చేప‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు. ఎన్నిక‌ల నియమావ‌ళిని అనుస‌రించి ఫిర్యాదుపై త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.