మళ్లీ బీఆరెస్ గూటికి తిరుమల్ రావు

మళ్లీ బీఆరెస్ గూటికి తిరుమల్ రావు

రెండు రోజుల్లోనే నిర్ణయం మార్చుకున్న తిరుమల్ రావు

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి


విధాత, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తిరుమల్ రావు తిరిగి సొంత గూటికే చేరారు. బీఆరెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన రెండు రోజుల క్రితం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.


అంతలోనే మనసుమార్చుకున్న తిరుమల్ రావు శుక్రవారం మరోసారి గులాబీ కండువా కప్పుకున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు, మార్కెట్ చైర్మన్ బుర్ర మౌనిక-శ్రీనివాస్, వైస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, గరిగంటి కుమార్ బాబు పాల్గొన్నారు.