విధాత: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామక ప్రక్రియలో జాప్యంపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఏపీపీల నియామక ప్రక్రియకు 18వారాల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ధర్మాసనం స్పందిస్తూ.. మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటివరకు ఏం చేశారని హైకోర్టు ప్రశ్నించింది. నియామక ప్రక్రియ నత్తనడక సాగుతోందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఏపీపీల కొరత వల్ల కేసుల విచారణ ముందుకు సాగట్లేదు. అక్టోబరు 31లోగా ఏపీపీ నియామక పరీక్ష ఫలితాలు వెల్లడించాలి’’ అని […]
విధాత: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామక ప్రక్రియలో జాప్యంపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఏపీపీల నియామక ప్రక్రియకు 18వారాల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ధర్మాసనం స్పందిస్తూ.. మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటివరకు ఏం చేశారని హైకోర్టు ప్రశ్నించింది. నియామక ప్రక్రియ నత్తనడక సాగుతోందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఏపీపీల కొరత వల్ల కేసుల విచారణ ముందుకు సాగట్లేదు. అక్టోబరు 31లోగా ఏపీపీ నియామక పరీక్ష ఫలితాలు వెల్లడించాలి’’ అని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.