ACB | ఏసీబీ చిక్కిన మరో రెండు అవినీతి చేపలు
ఏసీబీ వలలో మల్కాజిగిరి, మంచిర్యాలలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అవినీతి పై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.

విధాత : ఏసీబీ వలకు మరో రెండు అవినీతి చేపలు చిక్కాయి. మల్కాజిగిరి ఎల్లంపేట మున్సిపాల్టీ టౌన్ ప్లానింగ్ అధికారి చింతల రాధాకృష్ణారెడ్డి రూ.3లక్షల 50వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. లే అవుట్ ప్రహారీ గోడను, గేట్లను తొలగించకుండా ఉండేందుకు బాధతుడి రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసి..రూ.1లక్ష 50వేలు తీసుకుని..మిగతా రూ.3లక్షల 50వేలు తీసుకుంటూ అతను ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
మరో కేసులో మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండల పరిషత్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది టెక్నికల్ అసిస్టెంట్ బానోత్ దుర్గా ప్రసాద్ రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఫిర్యాదుదారునికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పశువుల షెడ్ నిర్మాణం ఎంబీ రికార్డు నమోదు..బిల్లు మంజూరీకి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.