‘అగ్రిగోల్డ్‌కు విజన్ ఎస్టేట్స్ బినామీ కాదు’..హైకోర్టుకు తెలిపిన ఏపీ సీఐడీ
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియకు హైకోర్టు ఆమోదముద్ర వేసింది. ఎస్‌బీఐ వేలంలో 1401 చ.గ. భూమిని రూ.22.45 కోట్లకు విజన్ ఎస్టేట్స్ సంస్థ దక్కించుకుంది. వేలం ప్రక్రియపై ఆరోపణలు రావడంతో ఏపీ సీఐడీ స్పందించింది. అగ్రిగోల్డ్‌కు విజన్ ఎస్టేట్స్ బినామీ కాదని హైకోర్టుకు తెలిపింది. వాస్తవ మార్కెట్ ధరకన్నా విజన్ ఎస్టేట్స్ తక్కువకు కోట్ చేసిందని సీఐడీ పేర్కొంది. వాస్తవ ధరకన్నా […]

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియకు హైకోర్టు ఆమోదముద్ర వేసింది. ఎస్‌బీఐ వేలంలో 1401 చ.గ. భూమిని రూ.22.45 కోట్లకు విజన్ ఎస్టేట్స్ సంస్థ దక్కించుకుంది. వేలం ప్రక్రియపై ఆరోపణలు రావడంతో ఏపీ సీఐడీ స్పందించింది.
అగ్రిగోల్డ్‌కు విజన్ ఎస్టేట్స్ బినామీ కాదని హైకోర్టుకు తెలిపింది. వాస్తవ మార్కెట్ ధరకన్నా విజన్ ఎస్టేట్స్ తక్కువకు కోట్ చేసిందని సీఐడీ పేర్కొంది. వాస్తవ ధరకన్నా తక్కువేనని ఏపీ ప్రభుత్వం, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం కూడా కోర్టుకు తెలిపాయి. ఇప్పటికే 3 సార్లు వేలం వేశామని, విజన్ ఎస్టేట్స్ మాత్రమే వేలంలో పాల్గొందని ఎస్‌బీఐ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. మూడు సార్లు వేలం వేసినందున ఇంకా వేచి చూడాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఎక్కువ ధరకు కొనే వారిని తీసుకు రాలేక పోయిందని వ్యాఖ్యానించింది. విజన్ ఎస్టేట్స్‌కు భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.