విద్యుత్తు రంగాన్నిదేశంలో నెంబర్ వన్ చేశాం

తెలంగాణలో విద్యుత్ రంగం అప్పుల మయమైందంటూ శ్వేత పత్రం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా దుష్ప్రచారానికి ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

విద్యుత్తు రంగాన్నిదేశంలో నెంబర్ వన్ చేశాం

♦ విద్యుత్తు రంగాన్నిదేశంలో నెంబర్ వన్ చేశాం

 అవినీతిపై ప్రభుత్వం ఆరోపణలు నిరాధారం

♦ సిటింగ్ జడ్జీతో విచారణకు సిద్ధం

♦ విద్యుత్తు రంగ శ్వేత పత్రంపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

తెలంగాణలో విద్యుత్ రంగం అప్పుల మయమైందంటూ శ్వేత పత్రం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా దుష్ప్రచారానికి ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. 


విద్యుత్తు రంగం శ్వేతపత్రంపై గురువారం అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చను ఆయన ప్రారంభించారు. విద్యుత్తు శాఖలో వేలకోట్ల అవినీతి జరిగిందంటున్న ప్రభుత్వం నిరాధారణ ఆరోపణలు చేస్తుందని, దీనిపై మేం సిటింగ్ జడ్జీ విచారణకు సిద్ధమని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.


విద్యుత్తు్ రంగ చర్చలో మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. మేం తెలంగాణ ఆవిర్భావం నాటికి సంక్షోభంలో ఉన్న విద్యుత్తు రంగాన్ని అభివృద్ధి చేసి పవర్ హాలీడేలు, విద్యుత్తు కోతలు, పేలిపోతే ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు..


విద్యుత్తు షాకులతో రైతుల చావులు లేకుండా అభివృద్ధి చేసి విద్యుత్తు రంగంలో దేశంలో తెలంగాణభు నెంబర్ వన్ చేశామన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు 24గంటల విద్యుత్తును సరఫరా చేశామన్నారు. అప్పులు తెచ్చి ఆస్తులు పెంచామని, తెచ్చిన అప్పులు సగానికి పైగా తీర్చేశామన్నారు.


ఇప్పటికే 85వేల కోట్ల అప్పుల్లో సమైక్య పాలకులు ఇచ్చినపోయిన 22వేల కోట్లు తీసివస్తే.. 55 వేల కోట్లకు పైగా అప్పులు తీర్చామన్నారు. ఇప్పుడు తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 1 లక్షా 37,570 కోట్లకు చేర్చామన్నారు. అప్పుల కోసం భయపడితే వెలుగులు ఉండేవి కావని, విద్యుత్ లేకుండా వ్యవసాయం జరగదన్నారు.



కరెంటు లేదని నిరసన తెలిపే అవకాశం ఏనాడు మా పాలనలో ప్రతిపక్షాలకు ఇవ్వలేదన్నారు. ఒక్క గుంట పంట కూడా ఎండనివ్వలేదన్నారు. కాంగ్రెస్ వాళ్ల మాదిరిగా ఆలోచించి ఉంటే రాష్ట్రం బాగుపడేది కాదన్నారు. 2004 తర్వాత వరుసగా మూడు సంవత్సరాలు బ్రహ్మండంగా వర్షాలు కురిసి హైడల్‌ విద్యుత్‌ అందుబాటులోకి వచ్చిందని..


ఆ కాలంలో కూడా రైతులకు వరుసగా 6 గంటలు విద్యుత్‌ ఇచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఆనాడు ఉత్తర- దక్షిణ విద్యుత్‌ నెట్‌వర్క్‌ మధ్య అనుసంధానం లేదని గుర్తు చేశారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి కరెంటు ఇవ్వాలంటే.. 3 గంటలకు మించి ఒక ఫీడర్‌లో ఇచ్చే అవకాశం లేదు.


ఎందుకంటే.. 133కేవీ, 220కేవీ, 400కేఈ అందుబాటులో లేదన్నారు.. దీంతో బ్యాక్‌డౌన్‌ చేయాల్సిన పరిస్థితి లేదన్నారు. రైతాంగానికి వరుసగా 6 గంటల కరెంటు ఇవ్వగలమా? అని ఆనాడు విద్యుత్‌ ఉద్యోగాలకు ఓ కల ఉండేది. కానీ ఇవాళ 24 గంటల కరెంటు ఇవ్వాలని నిర్ణయించిన మరుక్షణం ఎక్కువగా సంతోషించింది విద్యుత్‌ ఉద్యోగులే అని చెప్పారు.


పొరపాటున విద్యుత్‌ ఉద్యోగులు గ్రామాలకు వెళ్తే.. వాళ్లను గ్రామపంచాయితీలో పెట్టి తాళం పెట్టని గ్రామం లేదని గుర్తు చేశారు. సబ్‌స్టేషన్ల ముందుకు వచ్చే రైతులు ధర్నా చేసిన పరిస్థితి ఉండేదన్నారు. ‘ ఒకప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉంటే.. ఇవాల్టి ఉపముఖ్యమంత్రి పార్టీ ధర్నాలు, రాస్తారోకో చేసింది.


ఇదే అసెంబ్లీలోకి ఎండిపోయిన కంకులు, వరి, మక్క కంకులు, పత్తి చేలు తీసుకొచ్చింది. ఉపముఖ్యమంత్రి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి పార్టీ కూడా అలాగే చేసింది. ఈ సభలో ఈ ఘటనలు నిత్యకృత్యాలుగా ఉండేవి.’ అని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌ రంగంపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారని తెలిపారు.


కేంద్రం కరెంటు విషయంలో మన వాటా మనకు ఇవ్వలేదని, సీలేరు ఫ్లాంటును అన్యాయంగా ఏపీలో కలిపిందన్నారు. 53% సరఫరా ఇవ్వాలని విభజన చట్టం చెబుతుందన్నారు.

రాష్ట్రం ఏర్పడగానే వెంటనే విద్యుత్‌ ఉత్పత్తి చేయడం కష్టంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి గ్రిడ్‌ అనుసంధానం చేశామన్నారు. విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశామని తెలిపారు. మొదట అందుబాటులో ఉన్న వ్యవస్థతో గృహ, వాణిజ్య రంగానికి 24 గంటల కరెంటు తీసుకొచ్చాం.


ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి తీసుకొచ్చామన్నారు. ఒక సంవత్సరంలో విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థను అభవృద్ధి చేసి.. వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇంకా మెరుగుపరచుకుని 9 గంటల కరెంటు ఇవ్వగలిగామన్నారు.


రెండు సంవత్సరాల కాలంలో రైతాంగానికి కూడా 24 గంటల విద్యుత్‌ అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. సబ్‌ స్టేషన్లు, విద్యుత్‌ లైన్లను రెట్టింపు నిర్మించామని తెలిపారు.

ఆనాటికి ఈనాటికి తలసరి విద్యుత్ వినియోగం రెట్టింపు స్థాయిలో డిమాండ్ పెరిగిందన్నారు. దేశంలో నిరంతరం కరెంటు సరఫరా చేస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. సమైక్యపాలనలో జనరేటర్ లేని దుకాణం ఇన్వర్టర్ లేని ఇల్లు లేదన్నారు.


బిల్లుల వసూళ్లకు పోతే విద్యుత్ సిబ్బందిని నిర్బంధించేవారన్నారు. ఆనాడు కరెంటు కోసం రైతులు పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన పరిస్థితి ఉండేదన్నారు. నాతో సహా ఉమ్మడి పాలనలో పదవ తరగతి పరీక్షల వేళ కిరోసిన్ దీపాలు..కొవ్వోత్తుల వెలుగుల్లో చదువులు సాగించామన్నారు. మా పాలనలో సబ్ స్టేషన్లను, విద్యుత్తు లైనులను రెట్టింపు స్థాయిలో నిర్మించామన్నారు.


ప్రపంచంలో ఏ సంస్థ పెట్టుబడి పెట్టాలన్న తెలంగాణ వైపు చూస్తుందన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా వల్లే ఇది సాధ్యమైందన్నారు. 2014 ముందు బోరు బావుల తో వ్యవసాయం చేసే పరిస్థితి లేదని, కరెంటు ఎప్పుడోస్తుందో ఎప్పుడు పోతదో తెలిసేది కాదన్నారు.


మేం సరఫరా పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. 19 గంటలపాటు కరెంటు ఇచ్చినట్లు శ్వేత పత్రంలోనే తెలిపారని, మేం 24గంటల విద్యుత్తు ఇవ్వలేదని మంత్రులు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. వారి పాలనలో ఆరు గంటలే కరెంటు ఇచ్చినట్లు ఒప్పుకున్నారని, విద్యుత్ వినియోగంపై నీతి అయోగ్ ప్రశంసలు రాష్ట్రానికి గర్వకారణమన్నారు.